మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేసి తన భార్య కల్పన సోరెన్ ను ముఖ్యమంత్రి చేయబోతున్నారా? దీనికి సంబంధించి ఈరోజు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నిషికాంత్ దూబే ఓ ట్వీట్ చేస్తూ, జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి ఆమోదించారని వెల్లడించారు. అంతేకాకుండా సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఆయన భార్య కల్పన సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారని అందులో పేర్కొన్నారు.
అక్రమ మైనింగ్ కి సంబందించి మనీలాండరింగ్ కేసు కింద ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఈడీ ఆయనకు డిసెంబర్ 30న లెటర్-కమ్-సమన్లు పంపింది. మనీలాండరింగ్ కేసులో ప్రశ్నిలు అడిగేందుకు సమయం కేటాయించాలని ఈడీ ఆయనను కోరింది.
దీనికి సంబంధించి ఈడి ఆయనకు ఏడోసారి సమన్లు పంపినప్పటికీ అతడు హాజరు కాలేదు.ఆగస్టు 14న ఈడీ తొలి నోటీసు ఇవ్వగా ఈడీ చర్యల నుంచి ప్రొటక్షన్ కోరుతూ సుప్రీంకోర్టు ముందు, ఆ తర్వాత జార్ఖండ్ హైకోర్టు ముందు పిటిషన్ వేసినప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. తప్పుడు అభియోగాలు,జార్ఖండ్‌లో అనిశ్చితి సృష్టించడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు.