స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో నిత్యానంద రాసలీలల వీడియో తెగ వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ తరవాత డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు, అత్యాచర ఆరోపణలు, ఆశ్రమంలో ఏనుగు దంతాలు, పులి చర్మాలు ఇలా రకరకాల కేసుల్లో కటకటాల్లోకి వెళ్లిన నిత్యానంద బయటకు వచ్చిన భారత్ వదిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్ కు పారిపోయాడు. ఇది ఇలా ఉండగా, నిరుద్యోగులకు నిత్యానంద శుభవార్త చెప్పారు.
ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి ‘కైలాస దేశం’లో ఉద్యోగాలు ఉన్నాయని, దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఆయన ప్రతినిధులు ప్రచారం చేసుకుంటున్నారు. భారత్ లోని తమ శాఖల్లో ఏడాది పాటు వేతనంతో కూడిన శిక్షణ పూర్తి చేసుకుని అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో పని చేసేందుకు అవకాశం ఇస్తామని చెబుతున్నారు. నిత్యానంద హిందూ విశ్వవిద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస ఐటి విభాగం, కైలాస రాయబార కార్యాలయం, విద్యుత్ శాఖ, గ్రంథాలయం తదితరాల్లో ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ఉచితంగా శిక్షణ పొందుతూనే వేతనం కూడా తీసుకోవచ్చని సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపిస్తున్నాయి.