మరో ఎమ్మెల్యేకి కరోనా.. తెలంగాణలో కలకలం..!

-

తెలంగాణలో కరోనా విజృంబిస్తుంది. రోజురోజుకి వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వారుకు సామాన్య ప్రజలని వణికించిన కరోనా ఇప్పుడు రాజకీయ నాయకులను, అధికారులనువణికిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది అధికారులు దీని బారిన పడ్డారు. అలాగే మంత్రి హరీశ్ రావు పీఏ కి రావడంతో హరీశ్ రావు ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు. మంత్రి ఈటెల ది కూడా ఇదే పరిస్థితి. అలాగే ఇప్పటివరకు మొత్తంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. తాజాగా కరోనా బారిన మరో ఎమ్మెల్యే పడ్డట్టు తెలుస్తుంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. గత రెండు రోజులుగా అనారోగ్య లక్షణాల కారణంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డితో గణేష్ గుప్తా కాంటాక్ట్ అవ్వడం వల్లే వైరస్ సోకినట్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version