నిరుద్యోగులకు గుడ్ న్యూస్. NMDC లో 434 పోస్టులు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ఐటిఐ, బి-టెక్, డిప్లొమా చేసిన వాళ్ళకి అవకాశం. హైదరాబాద్‌ లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తోంది. ఏకంగా 434 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి వున్నా వాళ్ళు అప్లై చెయ్యొచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… బీ.ఈ/బీ.టెక్‌ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఫైనల్‌ ఇయర్‌/సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

 

అలానే సంబంధిత సబ్జెక్టుల్లో ఐదేళ్ల బీఈ/బీటెక్‌ + ఎంఈ/ఎంటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయడానికి అర్హులే. పోస్టుల వివరాలు చూస్తే… ఎగ్జిక్యూటీవ్ ట్రెయినీలు-67, ఎలక్ట్రికల్‌ – 10, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ – 25, మెకానికల్‌ – 14, మైనింగ్‌ – 18 వున్నాయి. ఇక వయస్సు అయితే గరిష్టంగా 27 ఏళ్లు మించకూడదు.

రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.500. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు గేట్‌-2021 పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

ఆ తరువాత షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అప్లై చేసుకోవడానికి చివరి తేది 21 మార్చి 2021. మరిన్ని వివరాలని అధికారిక వెబ్‌సైట్‌ https://www.nmdc.co.in/ లో చూడొచ్చు. అలానే ఇతర పోస్టులు కూడా వున్నాయి వెబ్ సైట్ లో పూర్తిగా చూడండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version