విజయ్ సేతుపతి ‘అనబెల్ & సేతుపతి’ ట్రైలర్ రిలీజ్

-

తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి.. తెలుగు చిత్ర పరిశ్రమ లోనూ తన క్రేజ్‌ ను రోజు రోజుకు పెంచుకుంటున్నారు. ఉప్పెన, సైరా, మాస్టర్‌ లాంటి సినిమాలతో తెలుగులోనూ ఓ రేంజ్‌ కు ఎదిగాడు విజయ్‌ సేతుపతి. అందుకే ఈయన సినిమాలను వరుసుగా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా మరో సినిమా కూడా తెలుగులో వస్తోంది. ఈ సారి ‘అనబెల్‌ సేతుపతి’ అనే ద్విభాషా చిత్రం తో ఆడియన్స్‌ ముందుకొస్తున్నాడు విజయ్‌ సేతుపతి.

ఈ సినిమా లో తాప్సీ హీరోయిన్‌ గా నటిస్తుండగా… ఫ్యాషన్‌ స్టూడియోస్‌ 8 బ్యానర్‌ పై సుధాన్‌ సుందరం, జి జయరాం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ ‘అనబెల్‌ సేతుపతి’ మూవీకి దీపక్‌ సుందర రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను విక్టరీ వెంకటేష్‌ రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా ఉందని.. వెంకటేష్‌ మెచ్చుకున్నారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు వెంకీ. ఇక ఈ మూవీ సెప్టెంబర 17 న హాట్‌ స్టార్‌ డిస్నీ లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news