కేసీఆర్, హరీష్ ఇద్దరిలో ఎవరైనా సరే.. తేల్చుకుందాం : ఈటల సవాల్

-

టీఆర్‌ఎస్‌ పార్టీ కి మరోసారి ఈటెల రాజేందర్ సవాల్‌ విసిరారు. కమలాపూర్ మండలలోని వివిధ పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలకు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు ఈటల. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… దమ్ముంటే కెసిఆర్ నా? హరీష్ నా ? ఎవరు తనపై నిలబడతారో చెప్పాలని… తాను పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.

”పోలీసులని, అధికారులను, మంత్రులను, డబ్బులు ఆపు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? ఆ దమ్ముందా?” అంటూ ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. శక్తి పైసలతో రాదని… ప్రజా బలంతో వస్తుందని చురకలు అంటించారు. తాను సాయం చేసిన వారు తనను కాపాడుకుంటారని తెలిపారు. హుజూరాబాద్ ఎడ్డిది కాదని.. చైతన్యవంతమైన గడ్డ అని స్పష్టం చేశారు ఈటల. కెసిఆర్ ఇంకా చెల్లదు నీ మోసం… ఇండియా టుడే సర్వే తేల్చింది… 84 శాతం ప్రజలు నిన్ను నమ్మడం లేదు అని ఫైర్‌ అయ్యారు. పార్టీల, జెండాల పంచాయితీ కాదు.. ఆత్మగౌరవ పంచాయితీ అని తెలిపారు. తనను గెలిపించి కెసిఆర్ అహంకారాన్ని అణచివేయాలని ఈటల కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news