రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా కీలక మార్పులు చేసింది. గ్రామ రెవెన్యూ అధికారుల పదవులు రద్దు చేసింది. ధరణి పోర్టల్లో ఆన్లైన్ ద్వారా భూ యాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది. పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూ రికార్డ్స్ నిర్వహణ ఉంటుంది. కొత్త చట్టం వ్యవసాయ యోగ్యమైన భూమి కోసం మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రముగా పరిగణలోకి తీసుకుంటారు. కోర్ బ్యాంకింగ్ సిస్టం – ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయాలని స్పష్టం చేసింది. కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా మాత్రమే పరిగణిస్తారు. ఆ రికార్డులో పట్టాదారు పేర్లు – సర్వే నంబర్లు – విస్తీర్ణం ఉంటాయని పేర్కొంది. ఈ చట్టం కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదని పేర్కొంది.