Kajal Agarwal: ‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్ పాత్రపై నో కామెంట్స్?

-

మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన పిక్చర్ ‘ఆచార్య’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో ‘ఆచార్య’ దర్శక, నిర్మాతలు మూవీ యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ నెల 29న విడుదల కాబోతున్న సినిమా మెగా అభిమానులకు పండుగ లాగా ఉంటుందని అందరూ చెప్పారు. ఈ చిత్రంలో మెయిన్ హీరో చిరంజీవి, కాగా, ఆయనకు జోడీగా నటించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో ఈవెంట్ కు రాలేదు. అయితే, ఈ ఫంక్షన్ లో దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ తదితరులు కాజల్ అగర్వాల్‌కు కనీసంగా థాంక్స్ కూడా చెప్పలేదు. కనీసంగా కాజల్ అగర్వాల్ పాత్రపై ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.

రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ‘నీలాంబరి’గా ఆచార్య చిత్రంలో చిన్న పాత్ర పోషించినప్పటికీ ఆమెకు థాంక్స్ చెప్పిన దర్శక, నిర్మాతలు..కాజల్ అగర్వాల్ పేరును కూడా కనీసంగా ప్రస్తావించలేదు. లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి ఒక్కరు మాత్రం కాజల్ అగర్వాల్ పాత్ర కూడా బాగుంటుందని పేర్కొన్నారు. అయితే, కాజల్ అగర్వాల్ పేరును కావాలనే మేకర్స్ పట్టించుకోవడం లేదా? హడావిడిలో పొరపాటుగా మరిచిపోయారా? అని కాజల్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

‘ఆచార్య’ ట్రైలర్ లో కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం పట్ల సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. కాజల్ పాత్రకు ప్రయారిటీ లేదా? అని కాజల్ అభిమానులు ప్రశ్నించారు. ‘ఆచార్య’ ప్రమోషన్స్ లోనూ పంచదరా బొమ్మ ప్రస్తావన రాలేదు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నూ కాజల్ అగర్వాల్ గురించి కనీస మాత్రంగానైనా మాట్లాడకపోవడాన్ని బట్టి సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదా? అని నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version