ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది. యుద్ధంలో ఉక్రెయిన్, రష్యా ఎవరూ కూడా వెనక్కి తగ్గక పోవడంతో.. యుద్ధం మరింత ముదురుతుంది. అలాగే యుద్దంలో ఉక్రెయిన్ కు సాయం నాటో యుద్ధ విమానాలను, బలగాలను పంపిస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. నాటో కూటమి యుద్ధ విమానాలు, బలగాలు యుద్ధానికి వస్తే.. తాము యుద్ధ తీవ్రత పెంచుతామని కూడా రష్యా ప్రకటన చేసింది. కాగ ఇలాంటి సందర్భంలో నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ కీలక ప్రకటన చేశారు.
ఉక్రెయిన్ మద్దతుగా నాటో కూటమి ఎలాంటి యుద్ధ విమానాలను గానీ, బలగాలను గానీ పంపించడం లేదని స్పష్టం చేశారు. కాగ ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరారు. తమ నాటో కూటమి రష్యాతో విభేదాలు కోరుకోవడం లేదని అన్నారు. దౌత్య ప్రయత్నాలు, చర్చల ద్వారా సమస్యలను చర్చించుకోవాలని విజ్ఞాప్తి చేశారు. అందుకు రెండు దేశాలు ముందడుగు వేయాలని కోరారు.