5 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు : కేటీఆర్

-

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని.. ఆధార్, బ్యాంక్ అకౌంట్లలో తప్పులను బూచిగా చూపిస్తూ మొత్తం 5 లక్షల మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయలేదన్నారు. మరోవైపు టెక్నికల్ సమస్య కారణంగా రుణమాఫీ కాలేదని, త్వరలోనే చేస్తామని అధికారులు చెబుతున్నా దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదన్నారు.

తాజాగా రైతు సమస్యలపై కేటీఆర్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎంకు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని ప్రశ్నించారు.రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రైతన్నలు రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. మరో 67 లక్షల మందికి పైగా రైతుబంధు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో దగాపడి అల్లాడుతున్నారు.రైతు వ్యతిరేక పాలనతో ప్రజలకు దసరా.. దసరాలా లేదు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news