టెన్నిస్ క్రీడా ప్రపంచంలో నెంబర్ వన్ ఆటగాడెవరంటే అభిమానులు ఠక్కున చెప్పే సమాధానం నొవాక్ జకోవిచ్ అని. అంతలా ఈ ఆటగాడు తన ఆటతీరుతో అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేశాడు. కేవలం ఆటతో మాత్రమే హైలెట్ కాకుండా అప్పుడపుడు తన వింత చేష్టలతోనూ వార్తల్లో నిలుస్తాడు. అందువల్లే కొంత మంది టెన్నిస్ అభిమానులు నొవాక్ జకోవిచ్ ఆటలో ప్రపంచ నంబర్ వన్ అయినప్పటికీ వ్యక్తిత్వంలో మాత్రం ఎప్పటికీ నంబర్ వన్ కాలేడని అంటూ ఉంటారు. వారు ఆరోపించినట్లుగానే ఆయన ఊరికే సహనాన్ని కోల్పోవడం విశేషం. మాజీ ప్రపంచ చాంపియన్లు… రోజర్ పెదరర్, రఫెల్ నాదల్ ఇలా ఎప్పుడూ తమ సహనాన్ని కోల్పోయి ప్రవర్తించలేదని చెబుతారు. అందుకే వాళ్లు ఇంకా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెబుతారు.
కాగా… ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ఒలంపిక్స్ లో టెన్నిస్ లో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. కానీ తనకు చివరికి కాంస్య పతకం కూడా లభించలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆయన తన రాకెట్ ను పలుమార్లు నేలకు విసిరి కొట్టాడు. అంతే కాకుండా అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లపై కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. టెన్నిస్ నెట్ ను కూడా రాకెట్ తో కొట్టాడు. దీంతో ఆగ్రహించిన చైర్ ఎంపైర్ జకోవిచ్ ను హెచ్చరించడం గమనార్హం. కాగా… జకోవిచ్ ఈ సారి ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచి గోల్డెన్ స్లామ్ పూర్తి చేయాలని కలలు కన్నాడు. కానీ తన కలలన్నీ కల్లలయ్యాయి. ఒకే ఏడాదిలో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు ఒలంపిక్ మెడల్ ను కూడా గెలవడాన్ని గోల్డెన్ స్లామ్ అని అంటారు