తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2న నిర్వహిచనున్న ప్రగతి నివేదన సభకు హైకోర్టు ఓకే చెప్పింది. ఈ సభ వల్ల పర్యావరణానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని, ప్రభుత్వం తమ నివేదికను అనేక మాధ్యమాల ద్వారా తెలియజేయవచ్చు అంటూ..పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది పూజారి శ్రీధర్ గురువారం పిల్ వేశారు. దీనికి సంబంధించి విషయాలను ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు..ఇప్పటికే సభకు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ న్యాయమూర్తికి వివరించారు. అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, పర్యావరణానికి హాని కలగకుండా సభ జరుపుకోవాలని సూచించారు. దీంతో ప్రగతి నివేదన సభకు లైన్ క్లియర్ అయింది.