శైలజ రెడ్డి అల్లు ట్రైలర్.. చైతు హిట్ పక్కానా..!

-

మారుతి డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. కామెడీ ఎంటర్టైనర్స్ అందించడంలో తన మార్క్ చూపించే మారుతి శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కూడా తన పంథా కొనసాగిస్తున్నాడు. ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంది.

అత్తా, కూతుళ్ల మధ్య హీరో నలిగిపోయే కథాంశంతో సినిమా వస్తుంది. ఇక మధ్యలో థర్టీ ఇయర్ పృధ్వి కామెడీ హైలెట్ గా నిలిచేలా కనబడుతుంది. ట్రైలర్ చివర్లో నాగార్జున ప్రియరాగాలే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ ప్లే చేయడం చూస్తుంటే మారుతి ఈ సినిమాలో చాలా అద్భుతాలే చేశాడని అనిపిస్తుంది. డాడీ స్కీం బాగా వర్క్ అవుట్ అయినట్టు ఉందని చైతు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

మొత్తానికి ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న నాగ చైతన్యకు ఈ సినిమా హిట్ కంపల్సరీ. మారుతి మార్క్ మూవీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టింది. సినిమాలో చైతుకి జోడిగా అను ఇమ్మాన్యుయెల్ నటించగా.. అత్తగా రమ్యకృష్ణ చేసింది. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ మరోసారి ఈ సినిమలో విజృంభించిందని టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే తెలుస్తుంది. మరి సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 13 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news