ఆ పాత్రను ఇండియాలో ఎన్టీఆర్ తప్ప మరొకరు చేయలేరు : కోన వెంకట్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ‘అదుర్స్-2’ సినిమా తీస్తానని రచయిత కోనా వెంకట్ తెలిపారు. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ‘అదుర్స్-2’ సినిమా గురించి కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అవసరం అయితే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసైనా అదుర్స్-2 చేయిస్తా అని అన్నారు. అదుర్స్ తన కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అని అన్నారు. ఆ క్యారెక్టర్ను ఎన్టీఆర్ లాగా చేసేవారు ఇండియాలోనే లేరు’ అని అన్నారు.

కాగా, అదుర్స్ 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్.టి.ఆర్ మొదటి సారిగా ద్విపాత్రాభిమానం చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. 2010 జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా 1300 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వాణిజ్య పరంగా మంచి లాభాలు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news