ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్డిక్ పాండ్య ని కెప్టెన్గా ప్రకటించిన నాటి నుండి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి కెప్టెన్గా రోహిత్ శర్మ మరో సంవత్సరం పాటు ఉంటే బాగుండేదనీ కొందరు అభిమానులు అంటుంటే మరికొందరు ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ముందే రోహిత్ కి తెలియజేసి గౌరవంగా అతని ద్వారానే కెప్టెన్ గా తప్పుకొమ్మని చెప్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను నియమించడంపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ భిన్నంగా స్పందించారు. ఇలాంటి వాటిపై తొందరపడి మాట్లాడితే పొరపాటే అవుతుందని అన్నారు. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయి ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పుడే ఓ అంచనాకు రాకుండా మరో రెండు మ్యాచుల వరకైనా వేచి చూడాలని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.