కాంగ్రెస్‌కు భారీ షాక్..కాషాయ పార్టీలోకి చేరిన బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్‌

-

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని పార్టీలకు ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి నాయకులు చేరుతున్నారు.కాగా, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.కాంగ్రెస్ పార్టీ నేత ,బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ బుధ‌వారం బీజేపీలో చేరారు. సీనియర్ నేతల సమక్షంలో విజయేందర్ సింగ్ కి కాషాయం పార్టీలో చేరారు.

ఈ పార్టీ మార్పులు ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జరిగింది. సుమలత అంబరీష్ కూడా బిజెపిలో చేరనున్నట్టు ప్రకటించారు. అంత‌కుముందు మాండ్య నియోజ‌క‌వ‌ర్గ స్వ‌తంత్య్ర అభ్య‌ర్థి ఎంపీగా సుమ‌ల‌త ఎన్నికయింది .దీంతో ఆమె రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ, జేడీఎస్ కూట‌మికి స‌పోర్టు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.ఎంపీ సుమ‌ల‌త అంబరీష్ 2019 ఎన్నికల్లో కుమార‌స్వామి కుమారుడు నిఖిల్‌పై విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. సుమలత మాండ్య లోక్సభ నియోజకవర్గానికి 4000 కోట్ల నిధుల్ని కేంద్రంలోని బిజెపి సర్కారు నుంచి రిలీజ్ చేసినట్టు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news