ఈ నగరంలో మరణాలను నిషేధించారు..70 ఏళ్లుగా ఇక్కడ ఒక్కరూ చనిపోలేదట..!

-

చావుపుట్టుకలపై ఎవరికి నియంత్రణ ఉండదు. ఎప్పుడు పుడతామే..ఎలా చనిపోతామే ఎవరికీ తెలియదు. మనిషి తనంతట తాను చనిపోవాలని ఆత్మహత్య చేసుకున్నప్పుడే చనిపోతాడు. లేదంటే..ఈ భూమ్మీద ఎన్నిరోజులు బతకాలని రాసిపెట్టి ఉంటే..అన్ని రోజులు జీవించడమే..కానీ ఒక నగరంలో మరణాలను నిషేధించారు. అదేంటి అనుకుంటున్నారా..అవును ఆ నగరంలో ఎవరూ చనిపోవడానికి వీల్లేదు. 70 ఏళ్లుగా అక్కడ ఎవరూ చనిపోలేదు కూడా. ఆ నగరం ఏంటి, అలా ఎందుకు చేశారో, దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

నార్వేలోని ఒక చిన్న పట్టణమైన లాంగ్ఇయర్బైన్ నగరంలో మరణాలను నిషేధించారు. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. జీవించడమే.. చాలా కష్టం. అందుకే ఇక్కడ చనిపోవడానికి అనుమతించరు. ఎవరైనా చనిపోతే ఆ మృతదేహం చాలా ఏళ్లు ఫ్రెష్గా ఉంటుంది. తీవ్రమైన చలి కారణంగా అది కుళ్ళిపోదు. దీని వల్ల మృతదేహాలు మట్టిలో కలిపిపోవడానికి కొన్ని సంవత్సరాలే పడుతుంది.

కొన్ని సంవత్సరాల క్రితం, శాస్త్రవేత్తలు ఒక శరీరంపై పరిశోధన చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1917 సంవత్సరంలో ఇన్ఫ్లుఎంజా కారణంగా మరణించిన వ్యక్తి శరీరంలో ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారి పరిశోధనలో తేలింది. ఈ విచారణ తర్వాత పరిపాలన విభాగం ఈ ప్రాంతంలో ప్రజల మరణాలను నిషేధించింది.

ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ ఎవరైనా చనిపోతే లేదా అతనికి అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఆ వ్యక్తిని హెలికాప్టర్ సహాయంతో దేశంలోని మరొక ప్రాంతానికి తీసుకెళ్లి అతను చనిపోయిన తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ నగరంలో శాస్త్రవేత్తలు, సాహస పర్యాటకులు పరిశోధనలు చేస్తున్నారు. సామాన్యులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు అసలు ఇష్టపడరు.

2000 వేల మంది ఉన్న ఈ నగరంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే విమానంలోనో, హెలికాప్టర్లోనో వేరే ప్రాంతానికి తీసుకెళ్లి చనిపోయిన తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. ఏదీ ఏం అయినా..ఆ పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది కదూ..చనిపోతున్నాం అని తెలిసి..అలా వెళ్లిపోవడం. కానీ అక్కడి వాతావరణం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version