మీకు ఎవరు చెప్పక్కర్లేదు.. ఇలా మీకు మీరే మోటివేట్ చేసుకోవచ్చు..!

-

ఎప్పుడూ ఎవరూ ఎవరిని మోటివేట్ చేయక్కర్లేదు. మన పనులని మనమే పూర్తి చేసుకోవచ్చు. మనం అనుకున్న దానిని మనమే రీచ్ అవ్వగలము. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి.

నిజానికి చాలా మంది వాళ్లని వాళ్లు మోటివేట్ చేసుకోవడానికి ఎంత గానో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వీటిని కనుక ఫాలో అయితే ఎవరిని వారు మోటివేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది.

క్యాలెండర్ లో మీ గోల్ ని పెట్టుకోండి:

మనం ఫోన్ ఓపెన్ చేసిన ల్యాప్టాప్ ఓపెన్ చేసిన క్యాలెండర్ వస్తుంది క్యాలెండర్ దగ్గర మీ టార్గెట్ ని క్రియేట్ చేసుకోండి. దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక మీ గోల్ పట్ల కాస్త ధ్యాస పెట్టి కష్టపడితే కచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవుతుంది. మీరు పెట్టుకున్న గోల్ ని దృష్టిలో పెట్టుకొని దానికోసం కష్టపడండి.

పర్ఫెక్ట్ గా లేని వాటికోసం చూసుకోండి:

కొన్ని కొన్ని సార్లు కొన్నిట్లో ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. అటువంటి వాటిని పర్ఫెక్ట్ గా మార్చుకోవడానికి చూసుకోండి. పర్ఫెక్ట్ గా కనుక మీరు పనులను చేసుకుంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించడానికి అవుతుంది.

ప్రోగ్రెస్ ట్రాక్ చేయండి:

మీరు ఎంత వరకు రీచ్ అయ్యారు ఇంకా ఏం చేయాలి ఇటువంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. అప్పుడు ఇంకా ఎంత కష్టపడాలి..? అనేది మీకు తెలుస్తుంది. దానితో మీరు గెలవడం ఈజీ అవుతుంది.

ఓటమి దూరం అవుతుంది:

ప్రతి చిన్న వాటికి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీరు రీచ్ అయిన ప్రతి ఒక్క దానికి కూడా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడం చాలా ముఖ్యం అలానే ప్రతి చిన్న సక్సెస్ ని కూడా మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే కచ్చితంగా విజేతలు ఇవ్వగలరు. ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు.

 

Read more RELATED
Recommended to you

Latest news