రేపు వాక్సినేషన్ లేదు..తెలంగాణ కీలక ప్రకటన !

Join Our Community
follow manalokam on social media

కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు కీలక ప్రకటన చేశారు. కోవిడ్ 19 కట్టడి కోసం చేసిన ప్రయత్నాలు.. ఇపుడు ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. తెలంగాణాలో కోవిడ్ వాక్సినేషన్ సక్సెస్ అయిందన్న ఆయన గాంధీలో క్రిష్ణమ్మ, నార్సింగ్ లో జయమ్మ తొలి టీకా వేసుకున్నారని అన్నారు. వాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ అందరికీ రోల్ మోడల్స్ అని ఆయన పేర్కొన్నారు.

వాక్సిన్ పూర్తి సేఫ్ అని తేలిపోయిందని, 20 మందికి టీకా వేసుకున్న చోట ఎర్రబడింది.. ఇది సమస్య కాదని అన్నారు. ఇక వాక్సిన్ వేసుకున్న వాళ్ళ ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తామన్న ఆయన రేపు వాక్సినేషన్ కు సెలవు ఇస్తున్నామని అన్నారు.  వాక్సిన్ వేసుకున్న వాళ్ళు.. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. ప్రయివేట్ ఆస్పత్రుల వాళ్లకు వచ్చేవారంలో టీకా వేస్తామని ఆయన అన్నారు. ఈ రోజు తెలంగాణా లో 3530 మంది వాక్సిన్ తీసుకున్నారని ఆయన అన్నారు. 

TOP STORIES

ఖాతాదారులకు అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల అలర్ట్‌ చేసింది. ట్వీట్టర్‌...