రూ.3499కే నాయిస్ ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్

-

స్మార్ట్ యాక్స‌స‌రీస్ త‌యారీదారు నాయిస్ ఓ నూత‌న స్మార్ట్ వాచ్‌ను నాయిస్ ఫిట్ యాక్టివ్ పేరిట విడుద‌ల చేసింది. ఇందులో 1.28 ఇంచ్ క‌లర్ ట‌చ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. హార్ట్ రేట్ ట్రాకింగ్‌, బ్ల‌డ్ ఆక్సిజ‌న్ (ఎస్‌పీవో2) మానిట‌ర్‌, స్ట్రెస్ మానిట‌ర్‌, గైడెడ్ బ్రీతింగ్‌, 14 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌, ఆటో స్పోర్ట్స్ రికగ్నిష‌న్‌, గూగుల్ ఫిట్ సింక్‌, వాట‌ర్ రెసిస్టెన్స్‌, 320 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ వాచ్ 7 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఇందులో జీపీఎస్‌కు స‌పోర్ట్ లేదు.

NoiseFit Active smart watch launched in india

నాయిస్ ఫిట్ యాక్టివ్ ఫీచ‌ర్లు…

* 1.28 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 240 x 240 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* బ్లూటూత్ 5.0, ఐఓఎస్ 9.0, ఆండ్రాయిడ్ 4.4 క‌నెక్టివిటీ
* క‌స్ట‌మైజ‌బుల్, క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేస్‌, 14 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌, గూగుల్ ఫిట్ సింక్
* యాక్స‌ల‌రోమీట‌ర్ సెన్సార్‌, హార్ట్ రేట్ మానిట‌రింగ్‌, ఎస్‌పీవో2 మానిట‌ర్
* స్ట్రెస్ మానిట‌ర్‌, బ్రీత్ మోడ్‌, స్లీప్ మానిట‌ర్‌, ఫీమేల్ హెల్త్ ట్రాక‌ర్‌, స్లీప్ ట్రాక‌ర్
* వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, కాల్స్‌, టెక్ట్స్‌, యాప్ అల‌ర్ట్స్‌
* రిమోట్ మ్యూజిక్ కంట్రోల్‌, సోష‌ల్ మీడియా నోటిఫికేష‌న్స్‌, స్టాప్ వాచ్‌
* ఫైండ్ మై ఫోన్‌, వెద‌ర్ ఫోర్‌క్యాస్ట్‌, డు నాట్ డిస్ట‌ర్బ్ మోడ్‌
* హ్యాండ్ వాష్ రిమైండ‌ర్‌, హైడ్రేషన్ రిమైండర్
* 320 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 7 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్

నాయిస్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ రోబ‌స్ట్ బ్లాక్‌, స్పోర్టీ రెడ్‌, ప‌వ‌ర్ బ్లూ, జెస్టీ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ వాచ్ ధ‌ర రూ.3499 ఉండ‌గా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news