Breaking: కేరళలో ‘నోరో’ వైరస్ కలకలం..!!

-

ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతోన్న ప్రజలకు కొత్త వైరస్‌లు పెను ముప్పుగా మారుతున్నాయి. తాజాగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ‘నోరో’ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమై వైరస్ కట్టడిపై చర్యలు తీసుకుంటున్నారు. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నోరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు చెబుతున్నారు.

నోరో వైరస్-చిన్నారులు
నోరో వైరస్-చిన్నారులు

అయితే ఇప్పటికే ఈ వైరస్ మరో దేశంలో వ్యాప్తి చెందింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేరళ ప్రభుత్వానికి అందించింది. ఈ సందర్భంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడారు. ఇద్దరు చిన్నారుల్లో నోరో వైరస్ గుర్తించామన్నారు. మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారుల్లో కొందరికి ఫుడ్ పాయిజన్ అయిందని, వారి నమూనాలను ల్యాబ్‌కు పరీక్షలకు పంపించగా.. నోరో వైరస్ నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచి ప్రతిఒక్కరూ వ్యతిగత శుభ్రత పాటించాలన్నారు. ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news