అత్యంత విషపూరితమైన ఆహారాలు.. ప్రాణాలు ఫణంగా పెట్టిమరీ తింటారట..!

-

ఫుడ్ లవర్స్ కు కొత్తకొత్త వెరైటీ వంటకాలు ట్రై చేయటం అంటే భలే ఇష్టం ఉంటుంది. అసలు ఒక ఫుడ్ ఐటమ్ ని ఎంత ఎంజాయ్ చేస్తూ తినాలో వీళ్ల దగ్గరనుంచే చూసి నేర్చుకోవాలి. అయితే ఈ వార్తమాత్రం ఫుడ్ లవర్స్ కి షాకింగ్ అనే చెప్పాలి. ఇప్పుడు చెప్పబోయే ఫుడ్ ఐటమ్స్ ని తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.. ఎందుకంటే ఇది అత్యంత విషపూరితమైన వంటకాలు అట. వీటిని తినడమంటే.. ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిందే. అయినా మాత్రం వీటికేం డిమాండ్ తక్కువగా లేదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ వంటకాలపై క్రేజ్ ఎక్కువే.. ప్రాణాలను ఫణంగా పెట్టిమరీ తింటారట. అసలు ఈ వంటలేంటో మనమూ చూద్దాం.

ఫూగు

జపాన్‌లో ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఇది. పఫర్‌ ఫిష్‌తో దీన్ని తయారు చేస్తారు. పఫర్‌ ఫిష్‌ అత్యంత విషపూరితమైనది. దీనితో వంటలు చేయడానికి జపాన్‌లో ప్రత్యేకంగా ట్రైనింగ్‌ కూడా ఇస్తారట. షెఫ్‌ ఏ మాత్రం ఏమరుపాటుగా వండినా దాన్ని తిన్నవారు ప్రాణాలు కోల్పోవటం ఖాయంమట.

బర్డ్స్ నెస్ట్ సూప్

పక్షులు ఉండటానికి గూడు కట్టుకుంటాయి. ఆ గూడుతో తయారు చేసే ఈ సూప్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట. ఒక కప్పు బర్డ్స్ నెస్ట్ సూప్ సుమారు పది వేల డాలర్లు ఉంటుంది. పక్షుల లాలాజలంతో తయారు చేసే చైనీయుల పురాతన వంటకం ఇది. ఏది ఏమైనప్పటికీ దీనిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది.

బ్లడ్‌ క్లామ్‌ (నత్త గుల్లలు)

చైనాలో బ్లడ్‌ క్లామ్‌లను తరచుగా తింటారు. అసలు ఈ చైనా వాళ్లు ఏది తినకుండా ఉంటారని..కదే మీకూ అనిపించింది. ఏవేవో తింటారు..ఇంకేకో వైరెస్ లను వదులుతారని..ప్రస్తుతం వీరిపై అందరూ పీకలవరకూ కోపంగా ఉన్నారు. అయితే బ్లడ్ క్లామ్ ను తగు జాగ్రత్తలతో తినకపోతే టైఫాయిడ్‌, హెపటైటిస్‌ బారీన పడే ప్రమాదం ఉంది.

పచ్చి కిడ్నీ బీన్స్‌

రెడ్‌ కలర్‌లో ఉండే పచ్చి కిడ్నీ బీన్స్‌లో భిన్న రకాలైన విష కారకాలు ఉంటాయి. వీటిని వండకుండా పచ్చిగానే తింటే ఆసుపత్రిలో బెడ్ కాయం. . అంతేకాకుండా పచ్చి కిడ్నీ బీన్స్‌ కంటే కూడా సరిగ్గా ఉడికించకుండా వీటిని తింటేనే అధికంగా హాని కలుగుతుందట.

ఫ్రై చేసిన మెదడుతో శాండ్‌విచ్‌ (ఫ్రైడ్‌ బ్రెయిన్‌ శాండ్‌విచ్‌)

ఇదేంట్రా బాబూ దీన్ని కూడా వదలరా అనిపిస్తుంది కదా.! ఆవు వంటి పశువుల మెదడుతో తయారు చేసిన శాండ్‌విచ్‌ల వల్ల అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్న కారణంగా వీటి తయారీని ప్రస్తుతం నిషేధించారు కూడా.

వీటన్నింటిని చదివాక..అసలు ఇలాంటి వాటితో వంటలు ఎలా చేసుకుంటారు అని సందేహం మీకు వస్తుంది కదా..ఉంటారు.. ఇంకా మన దగ్గరే ఇలాంటి వైరైటీ విషపూరిత వంటకాలు అందుబాటులో లేనందుకు సంతోషించాల్సిందే.!

Read more RELATED
Recommended to you

Latest news