గర్భగుడి పైకప్పు నుండి ఒక చుక్క నీరు లీక్ అవ్వడం లేదు : అయోధ్య ట్రస్ట్

-

అయోధ్య రామందిరంలో నీటి లీకేజీపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరంలో నీటి లీకేజీ అవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.ఈ క్రమంపై నీటి లీకేజీ వార్తలపై అయోధ్య రామ మందిరం ట్రస్టు క్లారిటీ ఇచ్చింది. రామ్ లల్లా గర్భగుడిలో నీటి లీకేజీ లేదని స్పష్టం చేసింది. రామ్ లల్లా గర్భగుడి పైకప్పు నుండి ఒక చుక్క నీరు లీక్ అవ్వడం లేదని ట్రస్ట్ వెల్లడించింది.

రామమందిరం పై ఎలాంటి అప్డేట్స్ అయినా రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం అఫీషియల్ హ్యాండిల్స్ నుండి వస్తే మాత్రమే నమ్మాలని ట్రస్టు పేర్కొంది.వాన నీటి డ్రైనేజ్ కోసం ఆలయ పరిసరాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని,వాన నీటిని నిల్వ ఉంచటం కోసం రీఛార్జ్ పిట్స్ ఏర్పాటు చేశామని ట్రస్టు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news