ఫిబ్రవరి 7- 14 మధ్య వాలెంటైన్ వీక్ ఉందని అందరికీ తెలిసిందే.ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినం జరుపుకున్నారు. కానీ ఇవాల్టి నుంచి యాంటీ వాలెంటైన్ వీక్ జరుపుకుంటారని మీకు తెలుసా. ప్రేమికుల దినోత్సవాన్ని రోజుకో రకంగా వారంపాటు ఎలా జరుపుకున్నారో, బ్రేకప్ వీక్ ఫిబ్రవరి 21వ తేదీ వరకు అలాగే జరగనుంది. ఈ వారం తమ ప్రేమకు బ్రేకప్ చెప్పటానికి రోజుకో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
సోషల్ మీడియా పుణ్యమా అని ఇది ఇటీవల పాపులర్ అవుతోంది. ఫిబ్రవరి 15న చెంపదెబ్బతో మొదలై, ఫిబ్రవరి 21న బ్రేకప్తో ముగుస్తుంది. స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే వంటివి ఈ వారంలో ఉంటాయి. వీటిని ఎవరు మొదలుపెట్టారో స్పష్టత లేదు.