రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి.. రెవెన్యూ లోటు తక్కువ చూపారు: కాగ్‌

-

తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ నివేదికను ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభ ముందు ఉంచారు. రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి.. రెవెన్యూ లోటు తక్కువ చూపారని ఈ నివేదికలో కాగ్‌ వెల్లడించింది. విద్య, వైద్యం మీద ఖర్చులో రాష్ట్రం వెనుకబడి ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో విద్య మీద కేవలం 8 శాతం ఖర్చు చేశారని, ఇక ఆరోగ్యం మీద 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించింది.

“ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి లేదు. విభజన ఆస్తుల పంపకాల విషయమై తగినంత దృష్టి లేదు. రూ.1.18 లక్షల కోట్లు బడ్జెట్‌ వెలుపలి రుణాలను బడ్జెట్‌లో వెల్లడించలేదు. బడ్జెట్‌ వెలుపలి రుణాలు జీఎస్‌డీపీ అప్పుల నిష్పత్తిపై ప్రభావం ఉంటుంది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి వచ్చింది. రుణాలపై వడ్డీలకు 2032-33 నాటికి రూ.2.52 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఆర్థికభారం ప్రభుత్వాన్ని గణనీయమైన ఒత్తిడికి గురి చేస్తుంది. బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చులో తగ్గుదల ఉంది.” అని కాగ్ నివేదిక తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news