విద్యుత్ శాఖలో ఏర్పడ్డ ఖాళీలను గుర్తించి వాటి భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు.అనంతరం గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసేందుకు ప్రయత్నించారు.
2024 అక్టోబర్‌లో విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైనందని నిరుద్యోగులు నిలదీశారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని, ప్రస్తుతం 5 వేలకు పైగా పోస్టులు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నాయన్నారు. వెంటనే విద్యుత్ సంస్థల్లో ఏఈ, ఎస్ఈ,జేఐఎం పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.