కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి… మరియు మార్కెటింగ్ కోసం గానూ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సరఫరా మరియు లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నోవావాక్స్ ఇంక్ బుధవారం కీలక ప్రకటన చేసింది. నోవావాక్స్ ఇంక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. సెప్టెంబర్ చివరి వారంలో క్లీనికల్ ట్రయల్స్ ఫేజ్ 3 ని ప్రారంభిస్తామని ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటన చేసింది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ లో తాము చాలా కీలకంగా ఉన్నామని నోవావాక్స్ ఇంక్ తెలిపింది. 2021 లో 1 బిలియన్ నుండి 2 బిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలమని వ్యాఖ్యానించింది. మేరీల్యాండ్‌కు చెందిన నోవావాక్స్ తన కరోనా వ్యాక్సిన్ పై చాలానే ఆశలు పెట్టుకుంది. సంస్థ తెలిపిన దాని ప్రకారం ఈ ఒప్పందం జులై 30 నే జరిగింది. వ్యాక్సిన్ పై కచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తుంది.