చంద్రబాబు త్యాగశీలి… ఇది అవివేకంతో కూడిన ఆప్షన్ కాదు!

-

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఏమైంది. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకాలంనుంచి రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తికి ఇది ప్రజాస్వామ్యం.. రాచరికం కాదు అన్న విషయం తెలియడం లేదా. జనాలను ఇంకా అమాయకులు అని ఎందుకు భావిస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జనాలు ఇంకా అమాయకత్వంలోనే ఉన్నారు.. బాబు ఏమి చెప్పినా నమ్ముతారనే భ్రమలో ఎందుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అభిమానులను తొలిచేస్తోన్న ప్రశ్నలివి! దీనికంతటికీ కారణం… 23 ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేస్తానని చంద్రబాబు చెప్పడం!

అవును… 48గంటల గడువు “తుస్” అనడంతో బాబు జగన్ ప్రభుత్వానికి మరో బంఫర్ ఆఫర్ ఇచ్చారు. దాని అర్ధమేమిటో.. ప్రజాస్వామ్యంలో ఆ ఆఫర్ ని ఎలా నిర్వచించాలో చంద్రబాబే చెప్పాలి. అమారవతే ముఖ్యం, కేవలం ఆ 29 గ్రామాలే ముఖ్యం.. మిగిలిన ప్రాంతాలన్నీ ఏమైపోయినా పర్లేదు అనే ఆలోచనతో ముందుకువెళ్తున్న బాబు… ఎమ్మెల్యే సీట్లు కూడా త్యాగం చేస్తానని చెబుతున్నారు ఎందుకు? అంటే టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలంటే ఉన్న ప్రేమ, బాధ్యత ఇదేనా?

జగన్ అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. ఇప్పుడు తమకున్న 23 ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేస్తానని చెప్పడం చంద్రబాబు అవివేకానికి మరో నిదర్శనం అనేది విశ్లేషకుల మాటగా ఉంది. కాసేపు వాస్తవాలు మాట్లాడుకుంటే… చంద్రబాబు తనకు ఇంకా 23 సీట్లు ఉన్నాయని భావించడం.. లేవని జనాలకు తెలిసినా కూడా వారిని మభ్య పెట్టడం! ఇక్కడ మరో విషయం ఏమిటంటే… 23 ఎమ్మెల్యే సీట్లు కూడా త్యాగం చేస్తానని చెబుతున్న చంద్రబాబు అంత త్యాగశీలే అయితే… ఇప్పుడే రాజీనామా చేసి అమరావతికి అనుకూలంగా పోరాటాలు చేయొచ్చు కదా!!

తన మాట వినని జగన్ ను రాజినామాలు చేయాలని డిమాండ్ చేయడం, అది జరగదని తెలిసి రాజకీయ డ్రామాలాడటం కంటే…. తన మాటవినే తన ఎమ్మెల్యేలతో రాజినామాలూ చేయించి.. తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చు కదా. టీడీపీ నేతలు 23 మంది అని బాబు అనుకుంటున్నారు కాబట్టి… పోనీ ఆ 20 / 23 రాజినామాలు చేయిస్తే… ఆ స్థానాల్లో వైకాపా ఎలాగూ పోటీ చేస్తుంది. ఫలితంగా అప్పుడు కూడా వైకాపా నేతలను మట్టికరిపిస్తే… ఏపీ సర్కార్ పునరాలోచనలో పడే అవకాశం ఉంది కదా!! ఫలితంగా అమరావతి వాయిస్ కి అధికారికంగా మరింత బలం పెరుగుతుంది కదా! ఇది చంద్రబాబు – ఏపీ సర్కార్ కి ఇప్పటివరకూ ఇచ్చిన అవివేకంతో కూడిన ఆప్షన్ కాదు కదా!!

బాబు ఆలోచనలు ఇలా ఉండకుండా.. కేవలం రాజకీయ డ్రామాలు ఆడుతున్నట్లుగా.. ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నట్లుగా ఎందుకు ఉంటున్నాయి… అవివేకంతో కూడిన ఆప్షన్స్ చెబుతూ ఎందుకు కాలయాపణ చేస్తున్నారు… ఇదే తమ్ముళ్ల ఆవేదన.. పార్టీ భవిష్యత్తు పై ఆందోళన!!

Read more RELATED
Recommended to you

Latest news