వారేవ్వా… తక్కువ ధరకే కరోనా మందు….!

-

నిజంగా ఈ వార్త తో ప్రతి ఒక్కరికి ఊరట లభిస్తుంది . అయితే కరోనా వైరస్ కి ఇప్పటి వరకు మందు లేదు. దీని తో ప్రజలు కూడా సతమతమవుతున్నారు. అయితే దేశీ ఫార్మా కంపెనీ గ్లెన్ ‌మార్క్ తాజాగా కరోనా వైరస్ ఔషధాలను తగ్గిం చేసింది. దీంతో ఏకంగా 27 శాతం వరకు ధరల్లో కోత విధించడం జరిగింది. కరోనా వైరస్ రోగులకు ఊరట నిచ్చింది అయితే గ్లెన్‌మార్క్ ఫార్మా తాజాగా ఈ వార్తను ప్రకటించింది. అయితే కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించే టాబ్లెట్స్ ధరను తగ్గించడం జరిగింది .

glenmark
glenmark

ఫవిపిరవిర్ టాబ్లెట్ ధరను రూ 103 నుంచి రూపాయలు 75 తగ్గించింది అంటే ఈ దశ లో ఏకంగా 27 శాతం కోత విధించడం జరిగింది. అయితే ఈ టాబ్లెట్ ని ఫ్యాబిఫ్యూ బ్రాండ్ పేరు తో మార్కెట్ లోకి వచ్చింది. అయితే ఈ ఫవిపిరవిర్ కొంచెం మరియు మధ్యస్థ లక్షణాల తో బాధ పడుతున్న వాళ్లకి బాగా పని చేస్తున్నట్లు కంపెనీ చెప్పింది. ఫార్మా కంపెనీ జూన్ 20 న ఫ్యాబిఫ్యూ డ్రగ్ తయారీ, విక్రయానికి సంబంధించి ఇండియా డ్రగ్ రెగ్యులేటర్ నుంచి తమకు అనుమతులు లభించాయని ప్రకటించింది.

కరోనా బారిన పడ్డవారు 1800 ఎంజీ పరిమాణం మాత్రమే మొదటి రోజు రెండో రోజు తీసు కోవాలి అని చెప్పింది తర్వాత 14 రోజుల పాటు 800 పరిణామం కలిగిన మాత్రలు వేసుకోవాలి అని చెప్పండి జరిగింది. అయితే ఇప్పటికే దేశం లో కరోనా కేసులు 8.7 లక్షలకు పైగా చేరాయి. అలానే 23 వేల మందికి పైగా మరణించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య 27 వేలు ఉండగా తెలంగాణ లో అయితే 33,000 కి చేరాయి. తీవ్రం గానే ఉంది పరిస్థితి అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news