దేశంలో ఉన్న ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త చెప్పింది. ఇకపై దేశంలో ఉన్న ఏ పీఎఫ్ కార్యాలయంలోనైనా ఖాతాదారులు పీఎఫ్ క్లెయిమ్ చేసుకునేలా ఓ సరికొత్త సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చింది. మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ పేరిట ఈ సదుపాయాన్ని అందిస్తోంది. దీని ద్వారా ఖాతాదారులు తమకు దగ్గర్లో ఉన్న పీఎఫ్ కార్యాలయంలో తమకు కావల్సిన క్లెయిమ్ పనిని పూర్తి చేసుకోవచ్చు.
కాగా కరోనా వైరస్ కారణంగా దేశంలో అనేక ప్రాంతాల్లో కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్న పీఎఫ్ కార్యాలయాలను మూసివేశారు. దీనికి తోడు పలు పీఎఫ్ కార్యాలయాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో పీఎఫ్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడం చాలా ఆలస్యమవుతోంది. దీంతో ఖాతాదారులు రోజుల తరబడి క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఇబ్బందులను అధిగమించేందుకే ఈపీఎఫ్‌వో అలా పైన తెలిపిన విధంగా నూతన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఇక కొత్త సౌకర్యం ద్వారా ఖాతాదారులు పీఎఫ్, పీఎఫ్ పెన్షన్, విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్ వంటి క్లెయిమ్‌లను చాలా సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.