ఎన్‌పీఎస్ ఖాతాదారులకు అలర్ట్… ఇక నుండి కొత్త రూల్స్..!

-

ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత ఏ సమస్య రాకుండా ఉండాలని ముందు నుండి కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. లేకపోతే వృద్ధాప్యం లో ఎంతో కష్ట పడాల్సి వస్తుంది. వృద్ధాప్యం లో హాయిగా ఉండడానికి అవ్వదు. అందుకోసమే ఉద్యోగులకు బాసటగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా జాతీయ పెన్షన్ వ్యవస్థని తీసుకువచ్చింది. దీనితో సరసమైన ధరల్లోనే సామాజిక భద్రత లభిస్తుంది. కొత్త పింఛన్ విధానం అమలవుతున్న ఉద్యోగుల పింఛన్ లావాదేవులు ఈ అకౌంట్ ద్వారానే జరుగుతాయి. ఇది మార్కెట్ లింక్ పెన్షన్ స్కీమ్.

ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు యజమానులు ద్వారా ఈ NPS ఖాతా లో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బులని రూపాయి రూపాయి దాచుకుని లేవలేని పరిస్థితులు లో ఉంటే వృద్ధాప్యంలో అండగా ఉంటుందని ప్రతి ఉద్యోగి పొదుపు మొదలు పెడతారు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా జాతీయ పెన్షన్ వ్యవస్థ ని తీసుకు వచ్చింది. దీని ద్వారా పౌరులకు సరసమైన ధరల్లోనే సామాజిక భద్రత ఇస్తోంది. కొత్త పింఛన్ విధానం అమలవుతున్న ఉద్యోగుల పింఛన్ లావాదేవీలు ఈ అకౌంట్ ద్వారానే జరుగుతూ ఉంటాయి.

ప్రస్తుతం ఏప్రిల్ 1, 2023 నుంచి పీఎఫ్ఆర్‌డీఏ సబ్‌స్క్రైబర్‌లకు ఎంపిక చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. ఫిబ్రవరి 22 2023న రిలీజ్ చేసిన సర్క్యులర్‌లో తెలిపిన వివరాల ప్రకారం అయితే యాన్యుటీ ఆదాయాన్ని సకాలంలో చెల్లించడానికి పత్రాల అప్‌లోడ్ తప్పనిసరి చేసింది. కనుక ఈ మార్పును పరిగణలోకి తీసుకోవాలని పీఎఫ్ఆర్‌డీఏ సూచించింది. ఇక అప్ లోడ్ చేయాల్సిన పత్రాల గురించి చూస్తే.. ఎన్‌పీఎస్ నిష్క్రమణ లేదా ఉపసంహరణ ఫారమ్, శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య కాపీ అంటే ప్రాన్ కాపీ, బ్యాంక్ ఖాతా రుజువు ని సుంబిట్ చెయ్యాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version