హైదరాబాద్ లో పబ్ కల్చర్ పై పోరాటం చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. పుడింగ్ పబ్ వ్యవహారం, డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ పబ్ లో అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బర్త్ డే ఫంక్షన్ ఉంటే నా కుమారుడు అక్కడికి వెళ్లాడని అన్నారు. మంచిమంచి ఆఫీసర్ల కొడుకులు కూడా ఉన్నారని… ఎవరో వచ్చి ఏదో చేస్తే దాన్ని మా కుమారుడికి రుద్దవద్దని ఆయన అన్నారు.
పబ్బులు బంద్ చేయాలి.. మద్యపాన నిషేధం తేవాలి: అంజన్ కుమార్ యాదవ్
-