ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ దుమ్ము లేపుతోంది. ఢిల్లీతో నిన్న జరిగిన రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించింది హార్థిక్ పాండ్యా సేన. ఢిల్లీ పై 14 పరుగులతో నిన్నటి మ్యాచ్ లో గెలిచింది గుజరాత్. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్నీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. దీంతో గుజరాత్ గ్రాండ్ విక్టరీ అందుకుంది. అయితే.. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. స్టాండ్స్ లో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
ఓ జంట లిప్ కిస్ పెట్టుకుని అందరినీ.. ఆశ్చర్యానికి గురి చేసింది. స్టేడియంలో.. అంత మంది ఉన్నా… చుట్టుపక్కల వారిని ఎవరినీ.. పట్టించుకోకుండా.. ఆ జంట కాసేపు ముద్దులాటలో మునిగి పోయింది. ఈ ఫోటో ను ఎవరో ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు తమ స్టైల్ లో స్పందిస్తు న్నారు.