తక్కువ ధరకే ఎన్టీఆర్ దేవర మూవీ థియేట్రికల్ రైట్స్?

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే… మూవీ థియేట్రికల్ హక్కులను తక్కువ ధరకు కోట్ చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.130 కోట్లకు కోట్ చేసినట్లు సమాచారం. ఇది తారక్ కెరీర్లో హయ్యెస్ట్ రైట్స్. కానీ ట్రెండ్ ప్రకారం ఇది చాలా తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప2, కల్కి చిత్రాల థియేట్రికల్ రైట్స్ ఒక్కో రాష్ట్రంలోనే దాదాపు రూ.100 కోట్లు పలకనున్నట్లు టాక్.

 

కాగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.తారక్ ఈ మూవీ లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news