తెలంగాణ సామాజిక సమస్యల్లో గల్ఫ్ కార్మికుల సమస్య అత్యంత ప్రధానమైనది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించాను. ఉద్యమ సమయంలో బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అని మాట్లాడిన వాళ్లు పదేళ్లు పాలించే అవకాశం వచ్చినా ఈ సమస్యకు పరిష్కారమార్గాలు చూపలేదు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గల్ఫ్ బాధితులకు ప్రభుత్వ పక్షాన అండగా నిలిచే ఆలోచన చేయలేదు. ఒకటి రెండు సంఘటనల్లో హడావుడి చేసి… ప్రచార ఆర్భాటానికి వాడుకున్నారు తప్ప, వ్యవస్థాపరమైన పరిష్కారం చూపలేదు అని విమర్శించారు.
తెలంగాణలో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో సామాజిక సమస్యగా పీడిస్తోన్న గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం మొదలు పెట్టాం. ఎన్నికల అనంతరం నూతన పాలసీతో పాటు, సహకారం కోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు