సినిమాలు మానేసి అలాంటి వ్యాపారం చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్..!!

-

సినీ ఇండస్ట్రీలో హీరోల లాగా హీరోయిన్లు ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని కొంతమంది ఒకటి రెండు సంవత్సరాలకే ఫేడ్ అవుట్ అవుతూ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఇకపోతే అందులో కొంతమంది రీ ఎంట్రీ ఇచ్చి తమ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదటి పెడితే మరి కొంత మంది ఇంటికే పరిమితం అవుతున్నారు. కానీ ఇంకొంతమంది డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోని ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన అంకిత కూడా బిజినెస్ రంగం వైపు అడుగులు వేసింది.

ఈమె మూడేళ్ల వయసులోనే రస్నా వంటి యాడ్ తో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అలా అతి చిన్న వయసులోనే ఎన్నో యాడ్స్ ని ఎండార్స్ చేసి మంచి స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది. ఇక తర్వాత హరికృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరి సినిమాతో తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలో కూడా అదరగొట్టింది. రాజమౌళి డైరెక్షన్లో నటించిన ఈమె ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో బాలకృష్ణతో విజయేంద్ర వర్మ సినిమాలో కూడా నటించింది. ఇక తర్వాత వినాయకుడు, స్టేట్ రౌడీ, అనసూయ వంటి సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీనే కాదు తమిళ్ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఇండస్ట్రీలో ఈమెపై కొన్ని పుకార్లు షికారులు అయ్యాయి. ఇక ఒక హీరో పై ఈమె చేసిన ఆరోపణలు అబద్ధం అంటూ తేలడంతో తెలుగు ఇండస్ట్రీలో ఈమెపై నమ్మకం కరువైంది.

తర్వాత ఈమె చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. తర్వాత విశాల ఝాటక్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది . ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక ప్రస్తుతం తన తండ్రి యొక్క వజ్రాల వ్యాపారాన్ని ఈమె కొనసాగిస్తూ ఉండడం విశేషం.. అంతేకాదు ఇప్పుడు సినిమాలలోకి వచ్చే అవకాశమే లేదని కూడా చెప్పింది అంకిత.

Read more RELATED
Recommended to you

Latest news