కార్ నంబర్ కోసం ఎన్టీఆర్ 17లక్షలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారు నంబర్ కోసం రూ.17లక్షలు ఖర్చు చేశారు. ఎన్టీఆర్ కార్ నంబర్ “9999” ను సొంతం చేసుకునేందుకు ఈ భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం లో నిన్న జరిగిన వేలంలో TS 09 FS 9999 నంబర్ ను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ ఇటీవల రూ. 3.10కోట్లతో లంబోర్ఘిని యూరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కారు కోసమే ఎన్టీఆర్ 9999 అనే కారు నంబర్ ను కొనుగోలు చేశారు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కు 9999 అనే నంబర్ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్టీఆర్ వద్ద ఉన్న కార్లు అన్నింటికీ 9999 నంబర్ ఏ ఉండటం విశేషం. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరుడు టివి షోకు హోస్ట్ గా చేస్తున్నారు.