అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో ప్రధాని నరేంద్ర మోడీ కి ఘనస్వాగతం పలికారు. మూడు రోజులపాటు ప్రధాని మోడీ.. అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఏ లక్ష్యంగా ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది.

ఇక నేడు అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. “ఆపిల్” సంస్థ సి.ఇ.ఓ టిమ్ కుక్ తో పాటు, పలు అమెరికన్ కంపెనీల అధిపతులతో కూడా సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందు సమావేశంలో పాల్గొననున్నారు ప్రధాని మోడి.

ఈ డిన్నర్ సమావేశానికి హాజరుకానున్నారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. సెప్టెంబరు 24 న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధాని మోడి. అదే రోజు, ఇండియా, జపాన్, అస్ట్రేలియా, అమెరికా దేశాలు సభ్యులుగా ఉన్న “క్వాడ్” దేశాల సమావేశంలో పాల్గొననున్నారు. సెప్టెంబరు 25న న్యూయార్క్ లో “ఐక్యరాజ్య సమితి సాధారణ సభ” ( జనరల్ అసెంబ్లీ) నుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడి… సెప్టెంబరు 27 న తరిగి భారత్ రానున్నారు.