పార్లమెంట్‌ పై ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

-

పార్లమెంట్‌ పై సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలపై చర్చ జరగకపోవడం పై చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లో సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన చర్చ లేకపోవడం తో న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని స్పష్టం చేశారు ఎన్వీ రమణ. కొత్త చట్టాల అసలు ఉద్దేశం ఏమిటో తెలియకుండానే పోతుందని మండి పడ్డారు. చట్టాల తయారీలో నాణ్యతా లోపం లిటిగేషన్లకు దారి తీస్తోందన్నారు. కొన్ని చట్టాలను కోర్టులు కూడా సరిగా అర్థం చేసుకోలేక పోతున్నాయని చెప్పారు. చట్ట సభల్లో మేధావులు మరియు న్యాయవాదులు లేకపోతే.. ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని చురకలు అంటించారు ఎన్వీ రమణ. ప్రజా జీవితంలో చురుకుగా ఉండాలని పేర్కొన్న ఆయన.. దేశానికి మంచి జరుగుతుందని న్యాయవాదులను ఉద్దేశించి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news