ఎమ్మెల్యే మైనంపల్లి పెద్ద గుండా….రేపటి నుంచి తాట తీస్తాం : బండి సంజయ్

-

స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రజల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ శ్రవణ్ పై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ,ఆయన అనుచరులు బీర్ బాటిల్ తో, రాడ్లతో దాడి చేశారని బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. లోకల్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పెద్ద గుండా అని.. గుండాయిజం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రేపటి నుండి నీ కబ్జాలు అన్ని బయటకు తీస్తామని.. మర్డర్ లు చేయగానే పోటుగాడు అవుతాడా..? అని నిలదీశాడు.

బీజేపీలో చేరతా అని వచ్చాడు ఇలాంటి వాడే అని మేము దగ్గరికి తీయలేదన్నారు.. పేదోళ్లను ఇబ్బంది పెడుతున్నాడు అనే మేము పార్టీ లో చేర్చుకోలేదని… గుండాయిజంను రేపటి నుండి తీస్తామని హెచ్చరించారు. పోలీసు అధికారుల ముందు దాడి చేస్తుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారని..మహిళల పై దాడి చేస్తే పోలిసులు ఉండి ఎందుకు..?అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులు ఎమ్మెల్యే కు కొమ్ముకాస్తున్నారని…బీజేపీ నేతలు చనిపోవడానికి అయిన చంపడనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తక్షణమే పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news