లిఖీంపూర్ ఖేరీ ఘటన దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా లఖింపూర్ ఖేరీ సంఘటన పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సంరద్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ లిఖీంపూర్ ఖేరీ ఘటనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరు లాయర్ల పిర్యాదు ను “ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం” గా నమోదు చేయాలని రిజిస్ట్రీ ని ఆదేశించినట్లు స్పష్టం చేశారు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ. సుమోటో విచారణ కు సుప్రీంకోర్టు స్వీకరించినట్లు తప్పుగా ప్రచారం జరిగిందని ఆయన తెలిపారు. ఫిర్యాదు చేసిన లాయర్లు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఆ లాయర్లు హజరయ్యేంత వరకు ఈ కేసును విచారణ చేయబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణను వాయుదా వేస్తున్నట్లు చెప్పారు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ..