బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని బాంబు పేల్చారు. జూన్ 2న లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉండబోతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న హరీశ్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని వ్యాఖ్యలు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని దింతో కేసీఆర్ తెలంగాణ సీఎం అవుతారని పేర్కొన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. కచ్చితంగా తెలంగాణలో సీఎం మార్పు జరుగబోతున్నట్లు బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్లు జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ చెప్పుకొచ్చారు. దింతో బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.