హఫీజ్ పేట భూముల వ్యవహారం.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు !

Join Our COmmunity

హఫీజ్ పేట భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. ఏకంగా సీఎం బంధువులను కిడ్నాప్ చేయడంతో అది చర్చనీయాంశంగా మారింది. దీని మీద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. మియాపూర్ ,హఫీజ్ పెట్ భూముల కు ప్రవీణ్ రావు,అఖిల ప్రియ లకు సంబంధం లేదని, ఆ భూములు ప్రభుత్వానివి అన్నారు.

పైగా వాటిని కేసీఆర్ బంధువుల కుటుంబాలు కన్నేసి కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన హైద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములలోప్రతి కబ్జా వెనుక సీఎం కుటుంబానికి సంబంధించిన వారో, మంత్రుల్లో ఉంటున్నారని అన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ బడా నేతలు ఉన్నారని ఆయన అన్నారు. సీఎం పేషీ ల్యాండ్, సాండ్, డ్రగ్ మాఫియా కి సెంటర్ పాయింట్ అయిందన్న ఆయన 111 జీఓ , హెచ్ ఎండీ ఏ ల పరిధిలో కట్టిన అక్రమ కట్టడాల కోసమే బీఆర్ఎస్ అని అన్నారు. ఈ అక్రమ కార్యకలాపాలకు బాధ్యుడు కేటీఆర్ అని అన్నారు. హఫీజ్ పెట్, మియాపూర్ భూములను త్వరలో బీజేపీ బృందం పరిశీలిస్తుందని అన్నారు.

TOP STORIES

సలాం.. మేజర్ మోహిత్ శర్మ..!

మేజర్ మోహిత్ శర్మ.. 19978 జనవరి 13వ తేదీన హర్యానాలోని రోహ్ తక్ గ్రామంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్, సుశీల. మేజర్ మోహిత్ శర్మను...
manalokam telugu latest news