కిడ్నాప్ కేసులో కీలకంగా మారిన ‘మాడాల శ్రీను’

హఫీజ్‌పేట్ భూ వ్యవహారంలో కిడ్నాప్ కు సంబంధించి కీలక అమ్స్షలు వెలుగు లోకి వస్తున్నాయి. ఈ ముఠా నాయకుడు గుంటూరుకు చెందిన మాడాల శ్రీను అంటున్నారు. భూమ అఖిలప్రియ కుటుంబానికి అన్నీ తానై శ్రీను నడిపిస్తున్నాడని అంటున్నారు. శ్రీను లగ్జరీ జీవితం చూస్తే కళ్లు బయర్లు కమ్ముతాయని, సరదాలకు హెలికాప్టర్లు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారని అంటున్నారు.

కిడ్నాప్ ఎలా చేయాలి, ఎలా వెళ్లాలి అన్న స్కేచ్ గీసింది శ్రీనునే నని అంటున్నారు. సినీపక్కీలో కిడ్నాప్‌కు ప్లాన్ చేసిన శ్రీను ముఠా సభ్యులు, శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.  శ్రీను ముఠా సభ్యులు భార్గవరామ్‌కు రైట్‌హ్యాండ్‌గా, అఖిలప్రియ కుటుంబానికి నమ్మదగ్గ కీలక అనుచరుడుగా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. దీంతో మాడాల శ్రీను నేరచరిత్రపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.