ఈ మధ్య కాలంలో తీసుకునే ఆహార పదార్థాలలో మార్పు వచ్చింది. అలానే జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. దీంతో తక్కువ వయసులోనే ఒబెసిటి సమస్య వస్తోంది. ఎక్కువ ఎనర్జీ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం లేక పోవడం వల్ల పిల్లల్లో ఒబిసిటీ సమస్య వస్తుందని ఎక్స్పెక్ట్ అంటున్నారు.
5 నుండి 19 ఏళ్ల పిల్లల్లో ఒబేసిటీ నాలుగు శాతం నుండి 18 శాతానికి పెరిగిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అయితే ఒబేసిటీ వలన కేవలం శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు యొక్క పర్సనాలిటీ మీద నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఒబిసిటీ తో బాధపడే పిల్లల్ని ఎక్కువగా ఏడిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనితో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. మూడ్ డిసార్డర్స్ లాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు.
దీని వల్ల అతిగా తినడం అలవాటు అయిపోతుంది. అయితే బాగా బరువుగా ఉండటం వల్ల హృదయ సంబంధిత సమస్యలు వంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తల్లిదండ్రులే పిల్లలకి జాగ్రత్తలు చెప్పి ఈ సమస్య నుండి బయట పడాలి. ఎక్కువ తినొద్దు, వ్యాయామం చేయాలి. అలానే తల్లిదండ్రులు పిల్లలకి కోపంగా చెప్పకుండా నెమ్మదిగా వాళ్ళ పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆరోగ్యకరమైన పోషక పదార్థాలను అందించాలి. ప్రాసెస్స్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి వాటిని అసలు ఇవ్వకండి. ఎక్కువ సేపు ఆటలు ఆడించడం, వ్యాయామం చేయడం లాంటి వాటిపై ఫోకస్ చేయండి. ఇలా ఒబెసిటీ సమస్య నుండి బయట పడడానికి అవుతుంది.