ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలిసినప్పటికీ కూడా ప్లాస్టిక్ వినియోగం అలానే ఉంది. నిజానికి ప్లాస్టిక్ లో ఎన్నో రకాల కెమికల్స్ ను ఉపయోగిస్తారు. అయితే ప్లాస్టిక్ వలన మెటబాలిజం దెబ్బతింటుంది. అలాగే బరువు పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ప్లాస్టిక్ కి బరువు పెరిగి పోవడానికి కారణం ఏమిటి..? మరి ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
సాధారణ ప్లాస్టిక్ లో చాలా రకాల పదార్థాలు ఉంటాయి. అయితే ప్లాస్టిక్ వాటిల్లో ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం మొదలు అనేక వాటికి ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించిన వాటిలో ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల బరువు పెరిగిపోవడం, ఒబిసిటీ లాంటి సమస్యలు కూడా ఏర్పడతాయి అని నిపుణులు చెప్తున్నారు. ప్లాస్టిక్ వలన బరువు ఎలా పెరిగిపోతారు అనే విషయంపై రీసెర్చర్లు పరిశోధనలో 34 రకాల ప్లాస్టిక్ వలన ఉపయోగం ప్లాస్టిక్ గురించి పరిశీలించారు.
డ్రింక్ బాటిల్స్, వంటింట్లో ఉపయోగించే స్పాంజ్లు ఇలా చాలా ఉన్నాయి. అయితే ప్లాస్టిక్ లో ఉండే కెమికల్ కారణంగా అది ఆహారానికి అంటుకుని దాని కారణంగా బరువు పెరిగిపోవడం, ఒబిసిటీ వంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. ఒబిసిటీ మరియు అధిక బరువు ఉండటం వల్ల కార్డియోవాస్క్యులర్ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు వస్తాయి. అలానే ఇతర ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తాయి. కరోనా మహమ్మారి సమయంలో అధిక బరువు ఉన్నవాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా ప్లాస్టిక్ కెమికల్స్ వలన ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి.