హైదరాబాద్లోని పాతబస్తీలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. దైరా మీర్ మోమిన్ స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు జరిపారు. ఓ బొమ్మకు ఐదుగురు వ్యక్తుల ఫోటోలను కట్టి క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇకపై ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పెట్రోలింగ్ పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు పోలీసులు స్థానికంగా ఉండే సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. క్షుద్రపూజల గురించి తెలియగానే స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. టెక్ నగరంలో ఇలాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో అని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.