సోషల్ మీడియా అంటేనే వింత వీడియోలకు విచిత్ర ఫొటోలకు నిలయం అనిప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనకు ఈ భూమి మీద అలాగే సముద్రాల్లో బ్రతికే జీవుల గురించి ఎలాంటి సమాచారం అయినా సరే అస్సలు బోర్ కొట్టవు. కారణం ఏంటంటే ఇవి ఎప్పుడూ మనకు ఇది వరకు చూడని కొత్త దనాన్ని చూపిస్తూనే ఉంటాయి కాబట్టి. ఇకపోతే మహా సముద్రాలు ఎప్పుడూ వింత జీవులతో కలర్‌ఫుల్‌గా ఉండటమే కాదండోయ్ అప్పుడప్పుడు మనకు అద్భుతాల్ని కూడా చూపిస్తాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది.
సాధారణంగా మనకు రంగులు మార్చే జంతువు అంటే ఊసరవెల్లి గుర్తుకు వస్తుంది. కదా. ఎందుకంటే ఈ జంతువు రంగులు మార్చినట్టు అసలు ఏ జీవి కూడా మార్చలేదేమో. కానీ ఇలా అనుకుంటే పొరపాటే ఇప్పుడు ఓ ఆక్టోపస్ కూడా తన స్కిన్ కలర్స్ ను ఈజీగా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటోంది. అయితే ఇది అచ్చం ఊసర వెల్లి మాదిరిగానే రంగులు మార్చుకోవడం ఇక్కడ విశేషం.
అయితే ఈ అక్టోపస్‌పై చుట్టుపక్కల ఉన్న ఏదైనా కలర్ పడితే ఆ కలర్ దాని స్కిన్‌పై కూడా సేమ్ అలాగే కనిపించడం ఇక్కడ ప్రత్యేకం. అంటే సేమ్ టు సేమ్ అద్దంలాగా అన్నమాట. ఈ వీడియో చూస్తే అక్టోపస్ ఓ ఓ చోట ప్రశాంతంగా నిద్రపోతోతుండగా ఇలా దానిపై ఏదైనా కలర్ పడితే ఒంటిపై రంగులు మాత్రం మారిపోతున్నాయి. కాగా మొదట వీడియోలో అది నాచు రంగులోఉండటం కనపిస్తోంది. కానీ అనూమ్యంగా వైట్ కలర్‌లోకి, ఆ తర్వాత మచ్చలున్నట్లుగా మారిపోయింది. ఇక లాస్ట్‌కు ముళ్లు ఉన్నట్లుగా త్రీడీ కలర్స్‌లో మెరుస్తోందని కనిపిస్తోంది.
An octopus changing colors in her sleep.. pic.twitter.com/eJZyThfg0I
— Buitengebieden (@buitengebieden_) August 21, 2021