గత వారంలో ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల మంది ప్రాణాలను కోల్పోగా, అంతే సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిని తరలించేందుకు ఒడిశా ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగా ఒడిశా సీఎస్ ప్రదీప్ జెనా ఒక ప్రకటనలో భాగంగా ఈ ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరినీ వారి స్వస్థలానికి చేర్చడానికి అయ్యే ప్రతి రూపాయి ఒడిశా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇందులో బాధితులు అయిన కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం అని చెప్పాలి.