చెత్తను హోమ్ డెలివరీ చేస్తున్నారు.. ఎందుకంటే..?

-

పర్యావరణ పరిశుభ్రత కోసం అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రజలు నిర్లక్ష్యంగా చెత్త వేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక పర్యాటక ప్రాంతాల్లో చెత్త వేసేందుకు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటారు. అయితే దీనిపై ఎంతగానో ఆలోచించిన అధికారులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే ఆ చెత్త మొత్తం ప్యాక్ చేసి ఏకంగా ఇంటికి హోమ్ డెలివరీ చేయనున్నారు.

బ్యాంకాక్ సమీపంలోని ఖావో యాయ్ నేషనల్ పార్క్ అధికారులు ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు. ఇక వారు పడేసిన చెత్తను ఎంతో శుభ్రంగా ప్యాక్ చేసి హోమ్ డెలివరీ చేసి అందులో ఇది పార్క్ లో మీరు పడేసిన చెత్త మర్చిపోయారు అంటూ ఒక లెటర్ కూడా పెడుతున్నారట. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారట. ఇక మళ్లీ పార్కు వచ్చినప్పుడు ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా చెత్త వెయ్యకుండా డస్ట్ బిన్ లోనే చెత్త చేస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా పార్కు పరిశుభ్రత కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news